ఏపీఎల్‌లో సత్తా చాటిన బెందాళం సాత్విక్‌కు ఘన సన్మానం
KANCHILI : కంచిలి ఇటీవల జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) క్రికెట్ టోర్నమెంట్లో భీమవరం బుల్స్ జట్టు తరఫున అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి ప్రతిభ చాటుకున్న యువ క్రికెటర్ బెందాళం సాత్విక్‌కు గ్రామంలో ఘన సన్మానం నిర్వహించారు.
గ్రామ పెద్దలు, విశ్వశాంతి క్రికెట్ సంఘం సభ్యులు శోభన్ బాబు, టి.వి. రమణ, భోగేశ్వరరావు, రమణ, సూరి, చైతన్య, అజేయ్ తదితరులు సాత్విక్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏపీఎల్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్లో రాణించడం ద్వారా సాత్విక్ గ్రామానికి గుర్తింపు తీసుకువచ్చాడని కొనియాడారు.

ఇదే పట్టుదలతో సాధన కొనసాగించి రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో మరిన్ని విజయాలు సాధించి గ్రామం, జిల్లాకు మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. యువత క్రీడలను ప్రోత్సాహకంగా తీసుకుని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు.
