Homeఆంధ్రప్రదేశ్ఎస్‌ఆర్‌సీ పురంలో వోల్టేజ్ సమస్య.

ఎస్‌ఆర్‌సీ పురంలో వోల్టేజ్ సమస్య.

KANCHILI : వోల్టేజ్ హెచ్చుతగ్గులతో నష్టం - పరికరాలు దెబ్బతింటున్న వైనం.

ఎస్‌ఆర్‌సీ పురంలో వోల్టేజ్ సమస్య.
ఏఈకి వినతిపత్రం అందజేత.
మాజీ సర్పంచ్ ప్రతినిధి డొక్కరి బలరాం ఆధ్వర్యంలో గ్రామస్తుల వినతి.
సమస్యను వెంటనే పరిష్కరిస్తామని ఎలక్ట్రికల్ ఏఈ హామీ.

KANCHILI : కంచిలి మండలం ఎస్‌ఆర్‌సీ పురం గ్రామంలో నెలకొన్న వోల్టేజ్ సమస్యపై మాజీ సర్పంచ్ ప్రతినిధి డొక్కరి బలరాం ఆధ్వర్యంలో గ్రామస్థులు శుక్రవారం కంచిలి ఎలక్ట్రికల్ ఏఈకి వినతిపత్రం అందజేశారు.   గత కొంతకాలంగా గ్రామంలో తీవ్ర వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల ఇళ్లలోని ఎలక్ట్రికల్ పరికరాలు పాడవుతున్నాయని,  రాత్రి వేళల్లో చదువుకునే విద్యార్థులు,  వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

వోల్టేజ్ హెచ్చుతగ్గులతో నష్టం – పరికరాలు దెబ్బతింటున్న వైనం:

గ్రామంలో లో-వోల్టేజ్ కారణంగా ఫ్యాన్లు, మోటార్లు సరిగా తిరగడం లేదని, హై-వోల్టేజ్ వచ్చినప్పుడు టీవీలు, ఫ్రిడ్జ్‌లు, బల్బులు కాలిపోతున్నాయని ప్రజలు వాపోయారు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని తెలిపారు.

ఏఈ సానుకూల స్పందన:  వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ.
గ్రామస్తుల నుంచి వినతి పత్రం స్వీకరించిన కంచిలి ఎలక్ట్రికల్ ఏఈ గారు సమస్యపై సానుకూలంగా స్పందించారు.

RELATED ARTICLES

Most Popular