Homeఆంధ్రప్రదేశ్ఆపరేషన్ క్లీన్ స్వీప్‌తో పలాస-కాశీబుగ్గలో పారిశుద్ధ్యానికి పెద్దపీట.

ఆపరేషన్ క్లీన్ స్వీప్‌తో పలాస-కాశీబుగ్గలో పారిశుద్ధ్యానికి పెద్దపీట.

PALASA : ఆపరేషన్ క్లీన్ స్వీప్‌తో పలాస-కాశీబుగ్గలో పారిశుద్ధ్యానికి పెద్దపీట.

ఆపరేషన్ క్లీన్ స్వీప్‌తో పలాస-కాశీబుగ్గలో పారిశుద్ధ్యానికి పెద్దపీట.

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్నారు. శుభ్రమైన రోడ్లు, శుభ్రమైన కాలువలు, శుభ్రమైన పరిసరాల లక్ష్యంతో గౌరవ శాసన సభ్యులు శ్రీమతి గౌతు శిరీష గారి ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణంలోని కాశీబుగ్గ ఓల్డ్ NH 5 రోడ్ లో అక్కుపల్లి జంక్షన్ నుండి 3 రోడ్ల జంక్షన్ వరకు గల మేజర్ కాలువపై ఉన్న అన్ని ఆక్రమణలను తొలగించి కాలువలో పేరుకుపోయిన సిల్ట్, చెత్తాచెదారాన్ని తొలగించే కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈ చర్యల ద్వారా వర్షపు నీరు సాఫీగా ప్రవహించేలా చేయడంతో పాటు నీటి నిల్వలు, దోమల వ్యాప్తి మరియు వ్యాధుల ప్రమాదాన్ని నివారించేందుకు కృషి చేస్తున్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాసులు గారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రమైన వాతావరణం కోసం పారిశుద్ధ్య కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే పట్టణ ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి మున్సిపాలిటీ చేపడుతున్న కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular