Homeఆంధ్రప్రదేశ్నాగుపాము హల్ చల్

నాగుపాము హల్ చల్

PALASA : గదిలో పడగవిప్పి బుసలు కొడుతూ ఉన్న సుమారు 6 అడుగుల నాగుపాము ను చూసి హడలిపోయారు.

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీ సూదికొండ ప్రాంతానికి చెందిన బుడ్డ. జంగమయ్య అనే అతని ఇంట్లోకి నాగుపాము చొరబడి హల్ చల్ చేసింది.

దినసరి కూలీగా పనులు నిమిత్తం బయటకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకుని తలుపులు తీసి లోపలికి వెళ్లగా గదిలో పడగవిప్పి బుసలు కొడుతూ ఉన్న సుమారు 6 అడుగుల నాగుపాము ను చూసి హడలిపోయారు.

భయబ్రాంతులకు గురైన కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు.

సుమారు 4 గంటలు పాటు నాగుపాము అక్కడే తిష్ఠవేయడంతో విషయాన్ని తెలుసుకున్న చుట్టుపక్కల వారంతా అక్కడకు చేరుకుని నాగుపాముని చూసి బెంబేలెత్తిపోయారు.

అనంతరం సమాచారమందుకున్న స్థానిక స్నేక్ కేచర్ చేరుకుని చాకచక్యంగా నాగుపాముని పట్టుకుని గోనె సంచిలో బంధించి దూరంగా అటవీప్రాంతంలో విడిచిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

RELATED ARTICLES

Most Popular