Homeఆంధ్రప్రదేశ్కరువు ప్రకటన భీమా కంపెనీల కోసం మా...  రైతు ప్రయోజనాల కోసమా?

కరువు ప్రకటన భీమా కంపెనీల కోసం మా…  రైతు ప్రయోజనాల కోసమా?

PALASA : కరువు ప్రకటన భీమా కంపెనీల కోసం మా...  రైతు ప్రయోజనాల కోసమా?

కరువు ప్రకటన భీమా కంపెనీల కోసం మా…  రైతు ప్రయోజనాల కోసమా…  సిపిఎం ప్రశ్న..

అక్టోబర్ ఒకటో తేదీన ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల ప్రకటనలో శాస్త్రీయత కొరవడిందని, రైతు ప్రయోజనాలు కంటే భీమా కంపెనీల ప్రయోజనమే కనిపించిందని సిపిఎం నాయకులు బమ్మిడి ఆనందరావు నేడు నగరంపల్లిలో విడుదల చేసిన ప్రకటన లో ఆయన పేర్కొన్నారు.  ఎల్ నినో ప్రభావం అనావృష్టి ఎక్కువగా ఉంటుందని రైతులందరూ జాగ్రత్త పడి పంటల బీమా కట్టుకోవాలని సూచించిన ప్రభుత్వం నేడు ఆ రైతులను మోసం చేసిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

జూలై నెలలో63.53 శాతం ఆగస్టు లో 67.9 శాతం లోటు ఇదే పరిస్థితి సెప్టెంబర్ 22 వరకు సాగింది…23, 24, 25 తేదీల్లో కురిసిన అతి భారీ వర్షం తో కలిపిన 22 శాతం లోటుగానే ఉంది అని ఆయన అన్నారు.   మరి వర్షాల ఆధారం చేసుకుని కరువు మండలాలు ప్రకటించామని జీవోలో పేర్కొన్న ప్రభుత్వం లోటు వర్షపాతం ఉన్న ఈ మండలాలు ఎందుకు కలపలేదోరైతు లకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.   మనిషి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి బలమైన ఇంజక్షన్లు ఆహారం ఇచ్చామని చెప్పడం ఎంత హాస్యాస్పదమో ఒకేసారి కురిసిన వర్షం కూడా కలిపి సాధారణ వర్షపాతం అనే చెప్పడం కూడా హాస్యాస్పదమే అనీ ఆయన అన్నారు. అడపా తడపా పడే వర్షాలకు ఓరి పంట నిలబడుతుందా, ఒకవేళ నిలబడిన అది పంట దిగుబడులు ఇస్తుందా మరి దేనిని దృష్టిలో పెట్టుకొని కరువు మండలాలు ప్రకటించారు ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

ఆర్టికల్చర్ దృష్టిలో పెట్టుకొని సీమ రైతులకు సంతృప్తి పరచడానికి చేసే ప్రయత్నం గా భాగం గానే ఇక్కడ తగ్గించి అక్కడ పెంచుతున్నారని ఆయన విమర్శించారు. రైతులు ప్రతిదీ నిచితంగా పరిశీలిస్తారని ఒకేసారి సరి అయిన తీర్పు ఇచ్చిన చరిత్రలో గమనంలో ఉంచు కావాలని ఆయన హితవు పలికారు.

మండలాన్ని కరువుగా ప్రకటించి పంటల బీమా పంట నష్టపరిహారం తో పాటు వ్యవసాయ కూలీలకు 200 పని దినాలు 600 వేతనము ఇచ్చే విధంగా చర్యలు చేపట్టి ఆదుకోవాలని ఆయన కోరారు.   వీటి  సాధన  కోసం  దశలవారేగా  పోరాటం  చేస్తామని  ఆయన  ఈ  సందర్భంగా  హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో  యన్ మోహనరావు,  చంద్రయ్య,  బి రామకృష్ణ,  టి భాస్కరరావు,  బి సుగుణ,  టి నిర్మల, టి సుధాకర్, బి భాస్కరరావు తదితలు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular