Homeఆంధ్రప్రదేశ్కాశీబుగ్గలో రైతు బజార్‌కు ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన.

కాశీబుగ్గలో రైతు బజార్‌కు ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన.

KASIBUGGA : కాశీబుగ్గలో రైతు బజార్‌కు ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన.

కాశీబుగ్గలో రైతు బజార్‌కు ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన.

దశాబ్దాల రైతు బజార్ కల సాకారం..!


శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైతు బజార్ కల ఎట్టకేలకు సాకారం కానుంది.

కాశీబుగ్గ మూడు రోజుల జంక్షన్ ఎదురుగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల ప్రాంగణంలో రైతు బజార్ నిర్మాణ పనులకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు.


రైతులు పండించిన పంటలను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశం కల్పించడంతో పాటు.. ప్రజలకు నాణ్యమైన కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రైతు బజార్ నిర్మాణం చేపడుతున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. ఇది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని అన్నారు.

రైతులకు, వినియోగదారులకు ప్రయోజనం కలిగేలా రైతు బజార్‌ను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

దశాబ్దాలుగా స్థానికంగా ఉన్న రైతు బజార్ డిమాండ్‌కు పరిష్కారం లభించడంతో రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


మొత్తానికి.. కాశీబుగ్గలో రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో.. రైతులు తమ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ పొందడంతో పాటు, వినియోగదారులకు కూడా నేరుగా వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి.

RELATED ARTICLES

Most Popular