Homeఆంధ్రప్రదేశ్ భరణికోట ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై సమగ్ర విచారణ జరపాలి

 భరణికోట ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై సమగ్ర విచారణ జరపాలి

PALASA:  భరణికోట ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై సమగ్ర విచారణ జరపాలి.

భరణికోట ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై సమగ్ర విచారణ జరపాలి

పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వినోద్ కుమార్ డిమాండ్.

PALASA : శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం భరణికోట ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సవర నవ్య శ్రీ అనే విద్యార్థిని విద్యార్థిని బుధవారం పాఠశాలలోని భవనం పై నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

గురువారం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని ఆయన పరామర్శించారు. అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ భరణికోటలో ఉపాధ్యాయులు మందలించడం వల్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని ఆత్మహత్యాయత్నం సంఘటన పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని , విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆశ్రమ పాఠశాలలో కౌన్సిలింగ్ లను నిర్వహించాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular