రైతులకు ఎరువుల పంపిణీ.
వ్యవసాయానికి అండగా ప్రభుత్వ చర్యలు.
KAVITI : కవిటి రైతులకు సకాలంలో ఎరువులు అందించి సాగు పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఇచ్చాపురం శాసనసభ్యులు, రాష్ట్ర విప్ బెందాళం అశోక్ బాబు పేర్కొన్నారు. సోమవారం కవిటి మండలం రామయ్యపుట్టుగలోని తన క్యాంపు కార్యాలయంలో రైతులకు ఎరువులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, సాగు సీజన్‌లో ఎలాంటి కొరత తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. రైతులు కూడా అవసరానికి అనుగుణంగా మాత్రమే ఎరువులు తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
