సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన దేశభక్తి.
PALASA : ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సామ్రాజ్యవాద యుద్ధాలకు వ్యతిరేకంగా, ప్రపంచ శాంతి కోరుకునే విధంగా విద్యార్థులు,యువత ఆలోచనలు పెంచుకోవాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య( ఐ ఎఫ్ టి యు ) జాతీయ ఉపాధ్యక్షులు పి.ప్రసాద్( పి పి )విద్యార్థులను పిలుపునిచ్చారు.
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ యూ రాష్ట్ర విజ్ఞా, వైజ్ఞానిక తరగతులలో భాగంగా రెండవ రోజు జాతీయ – అంతర్జాతీయ పరిస్థితులు అనే అంశం మీద P.ప్రసాదు క్లాసును బోధించారు. ఈ క్లాసుకు పిడిఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం అంకన్న( కడప ) అధ్యక్షత వహించారు.
ఏ క్లాసులో పి.ప్రసాద్ (పిపి )మాట్లాడుతూ, ప్రపంచ పెద్దన్నగా తనుకుతాను ప్రకటించుకుంటున్న అమెరికా, మూడో ప్రపంచ దేశాలపై, ప్రధానంగా గల్ఫ్ దేశాలను అదిరిస్తూ, బెదిరిస్తూ తన వద్ద ఉన్న మిలిటరీని ఉపయోగించి, చిన్నచిన్న దేశాల మీద యుద్ధాలను చేస్తూ వాటిని ఆక్రమిస్తుంది అన్నారు. ఈ క్రమంలోనే అతి చిన్న దేశమైన ఇరాన్ మీద భయంకరంగా దాడులు చేస్తూ, ఆ దేశంలోని వందలాదిమంది సాధారణ ప్రజలను చంపుతూ, భావితరాలకు పునాదులైన చిన్న పిల్లల సైతం చంపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరొకవైపు చైనా, జపాన్,రష్యా లు కూడా ప్రపంచ ఆధిపత్యం కోసం, మూడో ప్రపంచ యుద్ధానికి సై అంటున్నాయని, దీనివల్ల అంతిమంగా నష్టపోయేది పేద ప్రజలు, సామాన్య ప్రజలకే ప్రమాదం అన్నారు. కనుక విద్యార్థులు, యువత ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సామ్రాజ్యవాద యుద్ధాలకు వ్యతిరేకంగా నిలబడాలని, అదే నిజమైన ఆ దేశభక్తి అని పిలుపునిచ్చారు.

రెండవ సెషన్ :
పి డి ఎస్ యు చరిత్ర అను క్లాసును సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం..వినోద్ కుమార్ ఉపన్యాసించారు.. ఈ ఈ క్లాస్కు సంఘము రాష్ట్ర సహాయ కార్యదర్శి కాకి.నాని అధ్యక్షత వహించాడు. ఎం వినోద్ కుమార్ మాట్లాడుతూ, 1970 దశకంలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏర్పడిన పిడిఎస్ యూ అనతికాలంలోనే విద్యార్థుల వద్దకు చేరువైందన్నారు. ఎమర్జెన్సీ చీకటి పాలనను ఎత్తి పడుతూ ఎంతోమంది విద్యార్థులు అమరులైన, వారి ఆశయాలను ఇంకా మును ముందుకే తీసుకెళుతుంది అన్నారు. 1972లో కామ్రేడ్ జార్జిరెడ్డిని చంపేసిన మతోన్మాదులే నేడు కేంద్రంలో అధికారంలో ఉండి దేశంలో మత ఘర్షణలు సృష్టిస్తూ, యూనివర్సిటీలలో కులోన్మాద దాడులు చేస్తుందన్నారు. పిడిఎస్ యూ ఏర్పడి 52 సంవత్సరాలు కావస్తుందని, ఈ 52 సంవత్సరాల కాలంలో విద్యారంగంలో పేను మార్పులు వస్తున్న వేల, విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడే ఆందోళనలు చేస్తుందన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకు వస్తున్న నూతన జాతీయ విద్యా విధానాన్ని తీవ్రంగా ప్రతిఘటించాలన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా కాషాయకరణ, కార్పొరేటీకరణ తో పాటు జ్యోతిష్యం, భూత వైద్యం లాంటి వాటికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో చివరగా సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు ముగింపు ఉపన్యాసం చేస్తూ, రెండు రోజులపాటు విద్యార్థులు ఇక్కడ నేర్చుకున్న అంశాలను తమ జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. శ్రీకాకుళం, గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాలను వారసత్వంగా స్వీకరించి, భవిష్యత్తు పోరాటాలకు బాటలు వేసుకోవాలని, జార్జిరెడ్డి మొదలుకొని చాగంటి భాస్కరరావు, దేవినేని మల్లికార్జున్ ల విప్లవ అమరత్వస్పూర్తిని ఎత్తి పట్టాలన్నారు . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తూ, శాస్త్రీయ విద్య సాధన ద్యేయంగా పోరాడాలి అన్నారు.
కేంద్రంలో మోడీ వచ్చిన ఈ 12 ఏళ్ల కాలంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిందని, దీనికి వ్యతిరేకంగా అనేక మంది యువత నేడు రోడ్లెక్కి ప్రభుత్వం మీద కొట్లాడుతుందన్నారు. మోడీ ప్రభుత్వానికి భారత సంపద మొత్తం అదాని, అంబానీకే అప్పచెబుతూ, విద్యార్థులు,యువజనులు, రైతులకు కళ్ళల్లో కారం పెడుతున్నారు. విద్యార్థులు కేవలం చదువులు మాత్రమే కాకుండా, సమాజంలో పేద ప్రజలు పడుతున్న కష్టాలను చవిచూడాలని, వారి విముక్తి కోసం జరుగుతున్న పోరాటాలలో విద్యార్థులు యువత ముందు వరస లో ఉండాలని మాధవరావు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పిడియస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కే భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ సునీల్ అంకన్న నాని రాజేష్ మహేంద్ర బాబు వీరేంద్రప్రసాద్, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు అఖిలభారత రైతు కూలీ సంఘం నాయకులు బాలకృష్ణ భీమారావు వీరస్వామి కుసుమ ఈశ్వరమ్మ జగన్ తదితరులు పాల్గొన్నారు.
