Homeఆంధ్రప్రదేశ్జాడుపూడిలో 3 రైళ్ల స్టాపేజీపై రైల్వేశాఖ కార్యాచరణ.

జాడుపూడిలో 3 రైళ్ల స్టాపేజీపై రైల్వేశాఖ కార్యాచరణ.

KAVITI : జాడుపూడి స్టేషన్‌లో బేరహంపూర్-విశాఖపట్నం ప్యాసింజర్, విశాఖపట్నం-బేరహంపూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించాలని కోరారు.

జాడుపూడిలో 3 రైళ్ల స్టాపేజీపై రైల్వేశాఖ కార్యాచరణ.

KAVITI : కవిటి మండలం జాడుపూడి రైల్వే స్టేషన్‌లో మూడు రైళ్లకు స్టాపేజీ కల్పించాలన్న వినతిపై దక్షిణ తీర రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. గత నెల 4న సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మధురర్ ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌ను సందర్శించినప్పుడు జడ్ఆర్యూసీసీ మెంబర్ శ్రీనివాస్ రౌలో వినతిపత్రం అందజేశారు.

జాడుపూడి స్టేషన్‌లో బేరహంపూర్-విశాఖపట్నం ప్యాసింజర్, విశాఖపట్నం-బేరహంపూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించాలని కోరారు. ఈ వినతిపై విశాఖపట్నం డివిజన్ కార్యాలయంలో లేఖను జారీ చేసింది.

రైళ్ల స్టాపేజీ అంశంపై కార్యాచరణ, వాణిజ్య సాధ్యతలను పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. ఈ స్టాపేజీలు మంజూరైతే జాడుపూడి, ఆర్ బెలగాంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు విశాఖ, బేరహంపూర్, భువనేశ్వర్‌కు వెళ్లేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని శ్రీనివాస్ రౌలో తెలిపారు.

RELATED ARTICLES

Most Popular