వైఎస్ జయంతి వేడుకలకు సర్వం సిద్ధం
రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలకు ఏర్పాట్లు.
భారీగా తరలిరావాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపు
ICHAPURAM : ఇచ్చాపురం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని బుధవారం ఇచ్చాపురం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పూలమాలల సమర్పణతో పాటు రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
బుధవారం ఉదయం 10.30 గంటలకు ఇచ్చాపురం పట్టణంలోని బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పూలమాలలు సమర్పించి నివాళులర్పించనున్నారు. అనంతరం ప్రజలకు ఉపయోగపడేలా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు.
నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ముందుగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు పూలమాలలు సమర్పించి, స్థానికంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అందరూ ఇచ్చాపురం పట్టణానికి చేరుకుని ప్రధాన కార్యక్రమంలో పాల్గొనాలని ఇచ్చాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త శ్యామ్ ప్రసాద్‌రెడ్డి కోరారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జయంతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
