ఆ నలుగురు ట్రస్ట్ 8 వ వార్షికోత్సవ కార్యక్రమం రక్తదాన శిబిరంలో
రక్తదానం చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష
PALASA : పలాస నియోజకవర్గం పలాస ఆ నలుగురు ట్రస్ట్ 8వ వార్షికోత్సవ సందర్భంగా శనివారం పలాస కాష్యూలేబర్ & రైస్ మిల్లర్స్ లేబర్ యూనియన్ ఆఫీస్ లో ఆ నలుగురు ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష పాల్గొన్నారు.
ఈ సందర్బంగా శిరీష మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాలుగా రక్తదాతలను సమయానికి అందిస్తున్న ఆ నలుగురు టెస్ట్ సభ్యులకి శుభాకాంక్షలు తెలుపుతూ అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందించారు రక్తదానం మహా దానమని ఈ రక్తదానం యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేస్తూ ఉండాలని మనం రక్తదానం చేస్తూ మరొక నలుగురితో రక్తదానం చేయించాలని ఆమె పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలోనే స్వయంగా రక్తదానం చేశారు. ఆ నలుగురు ట్రస్ట్ వ్యవస్థాపకులు పిచ్చుక పాపారావు కోశాధికారి ఈశ్వరరావు మాట్లాడుతూ ఈ ఎనిమిది సంవత్సరాల లో 35 వేల మందికి పైగా ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం చేశారని 280 మందికి ఆ నలుగురు ట్రస్ట్ ప్రజ అంబులెన్స్ ఉపయోగపడిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌత శిరీష , ఏపీటిపిసి చైర్మన్ వజ్జ బాబురావు, బిసిసిఎల్ అధ్యక్షులు లోడగల కామేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు పీరికట్ల విఠల్ గారు పలాస క్యాజు అసోసియేషన్ అధ్యక్షులు మల్ల శ్రీను, గాలి కృష్ణారావు, లేబర్ యూనియన్ అధ్యక్షులు సప్ప నవీన్ గారు చిన్ని గారు కోరికాన శంకర్ సవర రాంబాబు అంబటి కృష్ణమూర్తి, సభ్యులు కోన రాము, బొంపల్లి సింహాచలం, కోనేరు భీమారావు,కుజ్జ ధర్మారావు, సప్ప ధర్మరాజు,పెంట అసిర్ నాయుడు,జోగి మోహనరావు,ఇతర కూటమి నాయకులు ఆ నలుగురు ట్రస్ట్ వ్యవస్థాపకులు పిచ్చుక పాపారావు కోశాధికారి సానా ఈశ్వరరావు సభ్యులు భాగ్యలక్ష్మి నరేష్ దీనబంధు హేమ సుందర్ విగ్నేష్ ప్రాణదాత బ్లడ్ బ్యాంక్ మేనేజర్ సాయి తో పాటు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది యువత విద్యార్థులు హాజరయ్యారు
