Homeఆంధ్రప్రదేశ్కోతుల బెడదపై స్పందించిన అటవీ శాఖ అధికారులు.

కోతుల బెడదపై స్పందించిన అటవీ శాఖ అధికారులు.

Kaviti: కోతుల బెడదపై స్పందించిన అటవీ శాఖ అధికారులు.

కోతుల బెడదపై స్పందించిన అటవీ శాఖ అధికారులు.

కవిటి మండలం ఆర్. బెలగాం గ్రామంలో కోతుల బెడద తీవ్రరూపం దాల్చడంతో అటవీ శాఖ అధికారులు శుక్రవారం గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. సతీష్ మెమోరియల్ ఫౌండేషన్ (ఎస్‌ఎంఎఫ్) రాష్ట్ర అటవీ శాఖకు చేసిన ఫిర్యాదు మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు.

రేంజ్ ఆఫీసర్ నేతృత్వంలోని బృందం గ్రామానికి చేరుకుని ఎస్‌ఎంఎఫ్ అధ్యక్షుడు జీరు వాసుదేవ్, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు, రైతులతో సమావేశమై సమస్యను అడిగి తెలుసుకుంది. గ్రామంలో గత ఆరు నెలలుగా 50కి పైగా కోతులు మకాం వేసి కొబ్బరి, మామిడి తోటలతో పాటు ఇతర పంటలను ధ్వంసం చేస్తున్నాయని, ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయని గ్రామస్తులు అధికారులకు వివరించారు. కోతుల సంచారంతో చిన్నారులను పాఠశాలకు పంపడానికే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దాడుల్లో పలువురు గాయపడిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని తెలిపారు.

అనంతరం అధికారులు కోతులు ఎక్కువగా సంచరిస్తున్న వీధులు, తోటలు, చెరువు గట్టు ప్రాంతాలను పరిశీలించి పంటలకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. సమస్య తీవ్రతపై నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని, వన్యప్రాణి సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కోతులను సురక్షితంగా పట్టుకుని జనావాసాలకు దూరంగా ఉన్న అటవీ ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపడతామని రేంజ్ ఆఫీసర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

గ్రామ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సతీష్ మెమోరియల్ ఫౌండేషన్ కృషిని గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది, ఎస్‌ఎంఎఫ్ సభ్యులు, గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular