Homeఆంధ్రప్రదేశ్గుర్తుతెలియని మృతదేహం లభ్యం.

గుర్తుతెలియని మృతదేహం లభ్యం.

PALASA: శ్రీకాకుళం జిల్లా బారువ–సోంపేట రైల్వే స్టేషన్ల మధ్య 650/11-13 విద్యుత్ స్తంభాల సమీపంలో మృతదేహం.

గుర్తుతెలియని మృతదేహం లభ్యం.

PALASA :  గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని పలాస రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఎం సోమేశ్వరరావు తెలిపారు.

వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా బారువ–సోంపేట రైల్వే స్టేషన్ల మధ్య 650/11-13 విద్యుత్ స్తంభాల సమీపంలో మృతదేహం లభ్యమైంది.

మృతుడు వయస్సు సుమారు 30 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని,  ఎత్తు సుమారు ఐదు అడుగులు,  నీలం రంగు జీన్స్ ప్యాంటు, నలుపు రంగు టీ-షర్టు ధరించి , టీ-షర్టుపై  ”సూఫీ కేఫ్”. అని తెలుపు రంగు అక్షరాలతో ముద్రించబడి ఉంది.

ఈ ఘటనపై పలాస రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు ఎవరైనా ఉంటే 9492250069 నంబర్‌కు సమాచారం అందించాలని హెడ్ కానిస్టేబుల్ ఎం.సోమేశ్వరరావు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular