Homeఆంధ్రప్రదేశ్శ్రీకాకుళంమహిళా డిగ్రీ కళాశాలలో నేడు జాబ్ మేళా

మహిళా డిగ్రీ కళాశాలలో నేడు జాబ్ మేళా

SRIKAKULAM: మహిళా డిగ్రీ కళాశాలలో నేడు జాబ్ మేళా

మహిళా డిగ్రీ కళాశాలలో నేడు జాబ్ మేళా

శ్రీకాకుళం : నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో “ఉన్నతి” ఫౌండేషన్ సహకారంతో బుధవారం భారీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. సూర్యచంద్రరావు, ఫౌండేషన్ కోఆర్డినేటర్ బి. రంజిత్ కుమార్ సంయుక్తంగా తెలిపారు.

ఈ మేళాలో వోల్టాస్, అపోలో ఫార్మసీ, టీవీఎస్, విస్ట్రాన్, దూత్ ట్రాన్స్ మిషన్స్, డాటా క్రాప్, ఎన్నస్ ఇన్స్ట్రుమెంట్స్ వంటి సుమారు 15 ప్రముఖ కంపెనీలు పాల్గొని, దాదాపు 600 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నాయి.

పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఎంఎల్టీ, ఫార్మసీ విద్యార్హతలు కలిగిన మహిళా, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాల జెరాక్స్ కాపీలు, రెజ్యూమే, ఆధార్ కార్డుతో జూన్ 24న ఉదయం 9 గంటలకల్లా శ్రీకాకుళంలోని మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణానికి చేరుకుని ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

RELATED ARTICLES

Most Popular