Homeఆంధ్రప్రదేశ్ట్రిపుల్ ఐటీ, పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీలో సీట్లు సాధించిన విద్యార్థులకు బహుమతులు.

ట్రిపుల్ ఐటీ, పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీలో సీట్లు సాధించిన విద్యార్థులకు బహుమతులు.

KANCHILI: ట్రిపుల్ ఐటీ, పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీలో సీట్లు సాధించిన విద్యార్థులకు బహుమతులు

కంచిలి జడ్పీహెచ్ స్కూల్ విద్యార్థులకు ఘన సన్మానం.

ట్రిపుల్ ఐటీ, పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీలో సీట్లు సాధించిన విద్యార్థులకు బహుమతులు.

KANCHILI: కంచిలి జడ్పీహెచ్ పాఠశాల విద్యార్థులు ట్రిపుల్ ఐటీ, పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీల్లో సీట్లు సాధించి పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.

ట్రిపుల్ ఐటీలో సీట్లు పొందిన సాలిహుండం ప్రవళిక, మారేడు దీపిక, కుంచ చాతుర్య, రాయల ఇందుమతి, పాలిటెక్నిక్‌లో ర్యాంకు సాధించిన సాయి కిషోర్ పాత్రో, ఏపీఆర్జేసీలో సీటు సంపాదించిన రత్నాల కార్తీక్‌లను ప్రధానోపాధ్యాయుడు చాణక్య, పెద్దలు జగదీష్ పట్నాయక్, పాఠశాల స్కూల్ చైర్మన్ గణప వాసు శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా జగదీష్ పట్నాయక్ ప్రతి విద్యార్థికి వెయ్యి రూపాయలు చొప్పున నగదు బహుమతి అందించి ప్రోత్సహించారు. పలువురు పెద్దలు విద్యార్థుల ప్రతిభను కొనియాడుతూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్దలు మురళి పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular