Homeఆంధ్రప్రదేశ్రైతు ఆనందమే లోకానందం.

రైతు ఆనందమే లోకానందం.

MANDASA : రైతు ఆనందమే లోకానందం.

రైతు ఆనందమే లోకానందం: ‘ప్రతి చేనుకు నీరు – ప్రతి చేతికి పని’ లక్ష్యంగా పలాసలో గౌతు శిరీషమ్మ అడుగులు!

MANDASA : సర్దార్ గౌతు లచ్చన్న గారి అలుపెరగని ఉద్యమ స్ఫూర్తితో, తండ్రి గౌతు శ్యామసుందర శివాజీ గారి ఆశయ సాధనతో, ప్రజాసేవే పరమావధిగా దూసుకుపోతున్నారు పలాస నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష  నిరంతరం ప్రజలతో మమేకమై, వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతర ప్రజా పక్షపాతిగా పలాస నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆమె అంకితభావంతో పనిచేస్తున్నారు.

​రైతు సంక్షేమమే ధ్యేయంగా “ప్రతి చేనుకు నీరు – ప్రతి చేతికి పని” అనే గొప్ప నినాదంతో, మందస మండలం డేసిబట్టి సానల్ నందు V V R పురం, బిన్నల, హరిపురం, తాళ్ళబద్ర సాగునీటి కాలువల పూడికతీత పనులను గౌతు శిరీష  సంకల్పంతో ఘనంగా ప్రారంభించడం జరిగింది.  ​వ్యవసాయానికి నీరందించి, రైతు ముఖంలో ఆనందం చూడటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పూడికతీత పనుల ద్వారా కాలువల చివరి ఆయకట్టు వరకు సాగునీరు సజావుగా అందుతుందని, తద్వారా పంటల దిగుబడి పెరిగి రైతాంగం ఆర్థికంగా బలోపేతం అవుతుందని స్థానిక నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

​ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీ బావన దుర్యోధన, క్లస్టర్ ఇంచార్జ్ కోర్ల కన్నా రావు , మార్పు వెంకటేశ్ , సుబముడి సిస్టమ్ అధ్యక్షుడు గుంట నారాయణ , సింగుపురం పాపారావు , యెన్ని నారాయణ మూర్తి , ప్రధాన మన్మథ రావు , మార్పు లక్ష్మణ రావు  మరియు ఇతర ముఖ్య తెలుగుదేశం పార్టీ (TDP) నాయకులు, కార్యకర్తలు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular