తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా రెవెన్యూ డే.
రిటైర్డ్ ఉద్యోగులు, సామాజిక సేవకుడికి ఘన సన్మానం.
కంచిలి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో శనివారం రెవెన్యూ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖలో విశిష్ట సేవలు అందించిన రిటైర్డ్ ఉద్యోగులు, సామాజిక సేవకుడిని తహసీల్దార్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో సన్మానించారు.
రిటైర్డ్ డీటీ అశోక్ పాణిగ్రహీ, రిటైర్డ్ వీఆర్ఓ పట్నాయక్, సీతయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గుళ్ల మోహన్ లను వారు చేసిన, చేస్తున్న సేవలకు గుర్తుగా శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు, పుష్పగుచ్ఛాలు అందజేశారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ రమేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజా సేవలో రెవెన్యూ శాఖ పాత్ర కీలకమని, పదవీ విరమణ చేసినా ప్రజలకు సేవ చేస్తున్న వీరి స్ఫూర్తి నేటి ఉద్యోగులకు ఆదర్శమని కొనియాడారు.
సీతయ్య ఫౌండేషన్ ద్వారా మోహన్ గారు చేస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
