హెచ్. ఆర్. ఇ .సి. ఐ చొరవతో రెండు కుటుంబాల మధ్య ఆస్తి వివాదం రాజి మరియు పరిష్కారం :
Narasannapeta : కొంతకాలంగా రెండు కుటంబాల మధ్య జరుగుతున్న ఆస్తి వివాదానికి హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారంతో రాజీ కుదుర్చుబడి సమస్య పరిష్కరించబడింది.
వివరాల్లోకి వెళ్లినట్లయితే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం జమ్ము గ్రామానికి చెందిన గంగరాపు పొట్టయ్య లేటు, కుమార్తె మరియు కుమారుడు అయిన గంగరాజు లక్ష్మి మరియు గంగరాజు రామకృష్ణ ల మధ్య గత కొంతకాలంగా ఆస్తి పంపకాల్లో తేడాలు మరియు వివాదం ఉన్నందున రెండు కుటుంబాలు మధ్య ఉన్న ఆస్తి వివాదాన్ని గూర్చి వారు హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (HRECI) ఆశ్రయించగా నేషనల్ చైర్మన్ ఈదురు పద్మాకర్ గారి సూచన మేరకు ఆంధ్ర మరియు ఒరిస్సా రాష్ట్రాల INCHARGE చైర్మన్ డాక్టర్ కె చిన్నవాడు గారి ఆధ్వర్యంలో వారి మధ్య రాజి కుదిర్చి ఎవరు ఆస్తి వాళ్లకు అప్ప జెప్పడం జరిగింది.
ఇందులో జిల్లా జనరల్ సెక్రెటరీ పంగ శివయ్య, జోనల్ జనరల్ సెక్రెటరీ మొయ్య జగన్నాథం, జిల్లా ప్రోగ్రామింగ్ కన్వీనర్ తలసముద్రం రాజారావు పాల్గొన్నారు.
