పలాస ఎయిర్ పోర్టుకు ముందడుగు పడింది – పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష.
PALASA : పలాస నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయే ఎయిర్పోర్టు కు అవసరమైన భూములను ఇవ్వడానికి బిడిమి, బహడపల్లి, బేతలపురం, రాంపురం, లక్మిపురం మరియు గంగువాడ గ్రామాల నుండి చాలామంది రైతులు ఈరోజు మధ్యాహ్నం పలాస ఆర్టీవో కార్యాలయంలో గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి శిరీష గారు, గౌరవ జాయింట్ కలెక్టర్ గారు మరియు ఆర్డీవోగారి సమక్షంలో రైతులు పక్షాన భూముల నష్టపరిహారము, తోటలకు సంబంధించిన నష్టపరిహారం మరియు ఉద్యోగ భద్రత వంటి అనేక విషయాల మీద అర్థవంతమైన చర్చలతో అధికారులు ఇచ్చిన మాట ప్రకారం వారి యొక్క సమ్మతిని తెలియజేస్తూ భూములు ఇవ్వడానికి అంగీకరిస్తూ మిగిలిన రైతులకు కూడా ఈ విషయాల మీద స్పష్టమైన సమాచారం తెలియజేసి త్వరితగతిన ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చడానికి సహకరిస్తామని తెలియజేయడం జరిగింది.

దీనితో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ముందడుగు పడింది ఇదే స్ఫూర్తితో అభివృద్ధిని కాంక్షిస్తూ భావితరాల కోసం మిగతా రైతులు కూడా ముందుకు రావాలని నియోజక వర్గ అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలని గౌరవ శాసన సభ్యులు శ్రీమతి గౌతు శిరీష గారు కోరడం జరిగింది.
రైతులు చెప్పిన అనేక విషయాల మీద సానుకూలంగా స్పందించిన గౌరవ కలెక్టర్ గారు తప్పనిసరిగా రైతుల కోరిక మేరకు వారిని సంతృప్తి కలిగే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి ముందుకు వెళ్లడమే కాకుండా ఆయా గ్రామాల సమగ్ర అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమమునకు హాజరైన రైతులు ఆనందాన్ని వ్యక్తపరిచారు.
