నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా.
KANCHILI : కంచిలి మండల పరిధిలోని పెద్ద కొజ్జిరియా గ్రామంలో ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను మాజీ సర్పంచ్ పొందల డిల్లీరావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేసి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
బాలకృష్ణ సినీ, రాజకీయ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారని, ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సత్యం, బొడ్డ మధుబాబు, బార్ల రాజేష్, పాఠశాల నరసయ్య, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
