జే భైరిపురంలో ప్రారంభమైన మూడు రోజుల విశ్వశాంతి మహాయజ్ఞం.
ఘనంగా ఏర్పాట్లు చేసిన గ్రామ పెద్దలు, యువజన కమిటీ.
KANCHILI : కంచిలి మండలం జే భైరిపురం గ్రామంలో మూడు రోజుల పాటు జరిగే విశ్వశాంతి మహాయజ్ఞం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. గ్రామ పెద్దలు, యువజన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మహాయజ్ఞంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రపంచ శాంతి, ప్రజల సుభిక్షం, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షిస్తూ వేద పండితులు యజ్ఞాన్ని ప్రారంభించారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం, సాయంత్రం హోమాలు, పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. చివరి రోజున పూర్ణాహుతి, అన్నదాన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి బుడ్డెపు కామేష్ రెడ్డి, గ్రామ పెద్దలు, యువజన కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. గ్రామంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.
