Homeఆంధ్రప్రదేశ్అక్రమ మట్టి త్రవ్వకాలు.

అక్రమ మట్టి త్రవ్వకాలు.

MANDASA : అక్రమ మట్టి త్రవ్వకాలు జరుపుతుండగా రెవెన్యూ అధికారులు దాడులు.

MANDASA : అక్రమ మట్టి త్రవ్వకాలు జరుపుతుండగా రెవెన్యూ అధికారులు దాడులు చేసి జేసిబి,ట్రాక్టర్లను మండల కార్యాలయానికి తరలించిన ఘటన శ్రీకాకుళం జిల్లా మందస లో చోటుచేసుకుంది.

శ్రీకాకుళం జిల్లా మందస మండల కేంద్రంలో గల గోపాలసాగర్ లో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా కొంతమంది కాసులకు కక్కుర్తి పడి జేసిబి లతో మట్టిని తవ్వి ట్రాక్టర్లతో తరలించి ఇటుకబట్టీల యాజమాన్యాలకు అమ్ముకుని కాసులు పోగేసుకుంటున్నారు.

ఈనేపథ్యంలో విషయం తెలుసుకున్న మందస మండల రెవెన్యూ అధికారులు మెరుపుదాడులు చేసారు. అక్రమ త్రవ్వకాలు జరుపుతున్న ప్రదేశంలో ఉన్న ఒక జేసిబి తోపాటు మరో ట్రాక్టర్ను పట్టుకోగా,మిగతా ట్రాక్టర్లు అక్కడ్నిండి పరారయ్యాయి.పట్టుబడ్డ జేసిబి,ట్రాక్టర్ లను మందస తహసీల్దార్ కార్యాలయానికి అధికారులు తరలించారు.

RELATED ARTICLES

Most Popular