PALASA: వెనుక నుండి లారీ ఢీకొని ద్విచక్రవాహణదారుడు తీవ్ర గాయాలపాలైన ఘటన శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం, కొబ్బరివూరు గ్రామ సమీప జాతీయరహదారి పై చోటుచేసుకుంది.
సోంపేట మండలం తాలభద్ర గ్రామానికి చెందిన సాయికుమార్, పలాస నుండి బయలుదేరి సోంపేట తన స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై తిరిగి వెళ్తుండగా వెనుక భాగం నుండి లారీ ఢీ కొట్టడంతో సాయికుమార్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారమందుకున్న పలాస 108 సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్రధమ చికిత్స అందించి క్షతగాత్రుణ్ణి పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
ప్రస్తుతం క్షతగాత్రుని ఆరోగ్యం నిలకడగా ఉండగా, క్షతగాత్రుని బంధువుల తోపాటు స్థానికులంతా నిండు ప్రాణాన్ని కాపాడారంటూ 108 సిబ్బందైన సత్యం, సురేష్ లను ప్రశంసిస్తున్నారు.
