Homeఆంధ్రప్రదేశ్మహిళా బిల్లు, మహిళా సాధికారతకు చారిత్రాత్మక అడుగు.

మహిళా బిల్లు, మహిళా సాధికారతకు చారిత్రాత్మక అడుగు.

PALASA : మహిళల పట్ల నిబద్ధతతో వారికి సమాన హక్కులు కల్పిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ మహిళలు తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్న పలాస ఎమ్మెల్యే గౌత శిరీష.

PALASA : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావము నుంచే మహిళ సాధికారతకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చింది.  మహిళలు కేవలం ఇంటికి పరిమితం కాకుండా సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించుకునేలా మార్గం చూపింది తెలుగుదేశం పార్టీ.

అన్న నందమూరి తారక రామారావు గారు,  మహిళలకు సమాన ఆస్తి హక్కులు కల్పించి,  వారి ఆర్థిక స్వావలంబనకు పునాది వేశారని,  ఆ ఆలోచనలను మరింత ముందుకు తీసుకెళ్లిన నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు.   మహిళలను సంఘటిత  శక్తిగా  తీర్చిదిద్దేందుకు  డ్వాక్రా సంఘాల ఏర్పాటుతో వారికి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు.

మహిళలు మరింతగా నాయకత్వ స్థానాలకు ఎదగాలని లక్ష్యముగా పెట్టుకుని చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఒక చారిత్రక నిర్ణయము.   మహిళలకు సమాన అవకాశాలు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని సంకల్పముతో తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు సాగుతుంది.

గత వైసిపి ప్రభుత్వం లో మహిళల పట్ల అవమానకర ధోరణి కొనసాగింది.   రాజధాని కోసం భూములు త్యాగం చేసిన మహిళలను సైతం అవమానించే విధముగా మాట్లాడించడం అత్యంత దురదృష్టకరం.   మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న గత వైసిపి ప్రభుత్వం వారిని హీనముగా చూడడం ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ.

రాష్ట్రంలో మహిళల భద్రత పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు వైసిపి అధికారంలో ప్రజలు చూశారని,  తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు భద్రతపై మళ్ళీ భరోసా ఏర్పడింది.   మహిళలు స్వేచ్ఛగా గౌరవంగా జీవించే సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని సమాజంలో ప్రతి రంగంలో మహిళలకు సముచిత ప్రాతినిత్యం కల్పిస్తూ,  వారికి గౌరవం భద్రత అవకాశాలు కల్పించడమే తెలుగుదేశం పార్టీ ఆశయం.

మహిళల పట్ల నిబద్ధతతో వారికి సమాన హక్కులు కల్పిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ మహిళలు తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్న పలాస ఎమ్మెల్యే గౌత శిరీష.

RELATED ARTICLES

Most Popular