కబడ్డీ పోటీలను ప్రారంభించిన జిల్లా కబడ్డీ అధ్యక్షులు శ్రీ యార్లగడ్డ వెంకన్న చౌదరి.
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కాశీబుగ్గ ZPHS గ్రౌండ్లో నిర్వహించిన కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పోటీలను జిల్లా కబడ్డీ అధ్యక్షులు శ్రీ వెంకన్న చౌదరి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా వెంకన్న చౌదరి గారు క్రీడాకారులతో పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని, కబడ్డీ వంటి గ్రామీణ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.
అనంతరం క్రీడాకారులకు జెర్సీలను అందజేసి పోటీలను అధికారికంగా ప్రారంభించారు. క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో యువత ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రీడాభిమానులు, యువకులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
