Homeఆంధ్రప్రదేశ్చెక్‌పోస్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.

చెక్‌పోస్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.

ICHAPURAM : గంజాయి అక్రమ రవాణా అరికట్టి చర్యలు చేపట్టి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ అధికారులకు పలు ముఖ్య సూచనలు చేశారు.

ఇచ్ఛాపురం రూరల్ , టౌన్ పోలీసు స్టేషన్లను, సరిహద్దు చెక్‌పోస్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.

అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు – జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్.

ఇచ్ఛాపురం మండలంలోని పురుషోత్తపురం వద్ద ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌, ఇచ్ఛాపురం రూరల్, టౌన్ పోలీసు స్టేషన్లను జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ముందుగా సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద చేపడుతున్న వాహన తనిఖీలు, రాకపోకల పర్యవేక్షణ, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది అప్రమత్తత, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను జిల్లా ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అనుమానాస్పదంగా కనిపించే వాహనాలు మరియు వ్యక్తులను తప్పనిసరిగా ఆపి పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని సూచించారు. గంజాయి, నిషేధిత పదార్థాలు, మరియు ఇతర అక్రమ వస్తువుల రవాణాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాత్రి వేళల్లో కూడా సమర్థవంతంగా తనిఖీలు కొనసాగించాలని, లైటింగ్ వ్యవస్థ సక్రమంగా ఉండాలని, అవసరమైతే సంబంధిత పోలీసు స్టేషన్లతో సమన్వయం చేసుకొని తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వవద్దని హెచ్చరించారు. అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులు నేర నియంత్రణలో అత్యంత కీలకమని, అక్రమ రవాణా, నేర కార్యకలాపాలు మరియు అనుమానాస్పద సంచారాన్ని అడ్డుకోవడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు.

ఇచ్ఛాపురం రూరల్ మరియు టౌన్ పోలీసు స్టేషన్లను ఆకస్మికంగా సందర్శన:

ఈ క్రమంలో జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ ఇచ్ఛాపురం రూరల్ మరియు టౌన్ పోలీసు స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు. పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తూ, కంప్యూటర్ గది, కేసు ప్రాపర్టీ నిల్వ గది, రికార్డుల భద్రపరిచే గదులను పరిశీలించారు. పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామాలు, అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, వాటి భౌగోళిక స్వరూపం గురించి ఆరా తీశారు. ముఖ్యమైన కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, పెండింగ్‌లో ఉన్న కేసుల కారణాలను సమీక్షించారు. రౌడీషీటర్లపై నిరంతర కౌన్సెలింగ్ నిర్వహించాలని, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం సేకరించి వెంటనే చర్యలు తీసుకోవాలని, గంజాయి అక్రమ రవాణా అరికట్టి చర్యలు చేపట్టి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ అధికారులకు పలు ముఖ్య సూచనలు చేశారు.

RELATED ARTICLES

Most Popular