Homeక్రైమ్దొంగకి దేహశుద్ధి

దొంగకి దేహశుద్ధి

PALASA : ఓ దొంగ ఇళ్లల్లో దొంగతనానికి పాల్పడుతూ దొరికిపోగా స్టానికులు దేహశుద్ధి చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస లో చోటుచేసుకుంది

పలాస లో దొంగలు రెచ్చిపోతున్నారు.  ఓ దొంగ ఇళ్లల్లో దొంగతనానికి పాల్పడుతూ దొరికిపోగా స్టానికులు దేహశుద్ధి చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస లో చోటుచేసుకుంది.

పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీ రెడ్డికవీది లోగల ఓ ఇంట్లో దొంగ చొరబడి చోరీకి పాల్పడేందుకు యత్నిస్తుండగా,  ఇది గమనించిన ఇంటి యజమాని కాలనీవాసుల సహాయంతో చాకచక్యంగా దొంగను పట్టుకుని వీధిలో స్తంబానికి కట్టి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు.

దొంగ ఒంటిమీద బట్టలు లేకుండా కేవలం ఒక టవల్ కట్టుకుని ఉన్నాడని, హిందీ మాట్లాడుతున్నాడని స్థానికులు చెపుతున్నారు.

దొంగలు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పగటిపూట రెక్కీ నిర్వహించి తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు.

పగలు రాత్రి అన్న తేడా లేకుండా దొంగలు రెచ్చిపోతుండడంతో పలాస ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

దొంగను అదుపులోకి తీసుకున్న కాశీబుగ్గ పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

RELATED ARTICLES

Most Popular