Homeఎడ్యుకేషన్10వ తరగతి టాపర్ల కృషికి ప్రశంస.

10వ తరగతి టాపర్ల కృషికి ప్రశంస.

10వ తరగతి టాపర్ల ను అభినందించిన కాళ్ల జైదేవ్…

ఇచ్చాపురం మండలంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను తెలుగు యువత అధ్యక్షుడు కాళ్ల జైదేవ్ సోమవారం స్వయంగా కలిసి అభినందించారు.   ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పుష్పగుచ్ఛం,  స్వీట్లు అందజేసి వారి కృషిని ప్రశంసించారు.   విద్యార్థులు తమ విజయానికి సంబంధించిన అనుభవాలను పంచుకోగా,   కష్టపడి చదివితే ఎవరైనా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని జైదేవ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా 590 మార్కులు సాధించిన నందిని మహారానీ,  588 మార్కులు సాధించిన సిందిరి దీక్ష ,  589 మార్కులు సాధించిన గౌతు కౌసల్య లను కలిసి,  అభినందించారు.   ఈ సందర్భంగా జైదేవ్ మాట్లాడుతూ,  ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాధించిన ఈ విజయాలు రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు.

ప్రభుత్వం తీసుకున్న విద్యా సంస్కరణలు,  ఉపాధ్యాయుల కృషి మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు.   భవిష్యత్తులో కూడా విద్యార్థులు ఇలాగే ముందుకు సాగి ఉన్నత స్థాయికి చేరాలని ఆశిస్తూ,  వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.   ఈ కార్యక్రమంలో కాళ్ళ జైదేవ్ తో పాటు కొర్రాయి ధర్మరాజు, కాళ్ళ సిద్దు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular