గుర్తుతెలియని మృతదేహం లభ్యం.
PALASA : గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని పలాస రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఎం సోమేశ్వరరావు తెలిపారు.
వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా బారువ–సోంపేట రైల్వే స్టేషన్ల మధ్య 650/11-13 విద్యుత్ స్తంభాల సమీపంలో మృతదేహం లభ్యమైంది.
మృతుడు వయస్సు సుమారు 30 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఎత్తు సుమారు ఐదు అడుగులు, నీలం రంగు జీన్స్ ప్యాంటు, నలుపు రంగు టీ-షర్టు ధరించి , టీ-షర్టుపై ”సూఫీ కేఫ్”. అని తెలుపు రంగు అక్షరాలతో ముద్రించబడి ఉంది.
ఈ ఘటనపై పలాస రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు ఎవరైనా ఉంటే 9492250069 నంబర్‌కు సమాచారం అందించాలని హెడ్ కానిస్టేబుల్ ఎం.సోమేశ్వరరావు తెలిపారు.
