Homeఆంధ్రప్రదేశ్సాగర్ కి రెండు లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సహాయం అందించారు.

సాగర్ కి రెండు లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సహాయం అందించారు.

PALASA : సాగర్ కి రెండు లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సహాయం అందించారు.

సాగర్ కి రెండు లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సహాయం అందించారు.

PALASA : ఇటీవల జిల్లా లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మూగ వ్యక్తి అయిన సాగర్ మహారాణా కలిసి తన ఇబ్బందులను వివరించారు.   సాగర్ పరిస్థితిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, వెంటనే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు,   పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్వయంగా సాగర్ కి,   ప్రభుత్వ తరపున మంజూరైన రూ. 2,00,000/- (రెండు లక్షల రూపాయల) చెక్కును సాగర్, సాగర్ కుటుంబ సభ్యులకు అందజేశారు.

కష్టకాలంలో తమను ఆదుకుని,  ఇచ్చిన మాట ప్రకారం సహాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి,  అలాగే పర్యవేక్షించిన ఎమ్మెల్యే గౌతు శిరీష గారికి సాగర్ కుటుంబ సభ్యులు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.  ప్రభుత్వం సామాన్యుల సమస్యలపై ఇలా తక్షణమే స్పందించి, ఆదుకోవడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.

RELATED ARTICLES

Most Popular