ఇచ్చాపురం మున్సిపాలిటీలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్ యాత్ర
ICHAPURAM : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ రోజు ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో కాళ్ళ జైదేవ్ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు పర్యావరణ ప్రేమికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సైకిల్ యాత్ర ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాం.
ఈ సందర్భంగా ఇచ్చాపురం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కాళ్ళ జైదేవ్, మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నాను. వాహనాల వినియోగాన్ని తగ్గించి, సాధ్యమైనంత వరకు సైకిళ్లు ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు.
అదేవిధంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పరిశుభ్రమైన మరియు హరితమయమైన ఇచ్చాపురం నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సైకిల్ యాత్ర విజయవంతం కావడానికి సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నర్తు అప్పారావు, పిట్ట శివ, కొరికాన ధర్మ, బచ్చు శంకర్, కాళ్ళ శివ, సుభాష్ రౌలో తదితరులు పాల్గొన్నారు.
