నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ – పాలకొండ డిపో.
PALAKONDA : ఏపీ పిటిడి విజయనగరం జోన్ 1 లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పాలకొండ డిపో వద్ద గేట్ మీటింగ్ లో ఉద్యోగులు సమస్య ల పై యాజమాన్యం స్పందించడం లేదని జిల్లా ఉపాధ్యక్షుడు పి ఎల్ రావు తెలియజేశారు. ముఖ్యంగా శ్రీ శక్తి స్కీం వలన ప్రత్యక్షంగా సేవలు అందించుతున్న డ్రైవర్ కండక్టర్లు అనేక ఇబ్బందులు అనగా ఒక్కొక్క బస్సులో వందలాది ప్రయాణికులు ఎక్కడం సరిపడా బస్సులు లేకపోవడం ప్రయాణికులు సంఖ్య పెరగడం వలన సిబ్బంది చిన్న చిన్న విషయాల్లో దాడులకు గురి అవ్వడం, కొత్త బస్సులు పెంచాలని, టీ0 మిషన్లు సరిగా లేకపోవడంతో సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వివరించడం జరిగింది.
ఓ.టీ డ్యూటీ లను R/O డ్యూటీ లాగా మార్చాలని, సస్పెండ్ అయిన డ్రైవర్ కండక్టర్లు సేమ్ డిపో లో పోస్టింగ్ ఇవ్వాలి. పాలకొండ -విశాఖ రూట్ లో రన్నింగ్ టైమ్ పెంచాలని, ఆన్ కాల్ డ్రైవర్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది కీ E S I కార్డులు ఇవ్వాలి. కే ఎం పి ల్ పై డ్రైవర్ లను వేధించే విధానం ఆపాలని కోరారు. పెండింగ్లో ఉన్న అన్నీ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, గ్యారేజ్ లో పెంచిన పని భారాన్ని తగ్గించాలి అని, డిపో కార్యదర్శి వావిలపల్లి రాజేష్ గేట్ మీటింగ్ లో తెలియచేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కార్యదర్శి డి జి రావు.బి లక్ష్మీ నారాయణ.డి జే బాబు.బి వి రమణ. ఎం ర్ బాబు. చంద్రరావు. పుణ్యవతి. ధర్మంబా. గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు
