Homeఆంధ్రప్రదేశ్రైతాంగ సంక్షేమం కోసం మరో కీలక అడుగు .

రైతాంగ సంక్షేమం కోసం మరో కీలక అడుగు .

MANDASA : ప్రతి చేనుకు నీరు - ప్రతి చేతికి పని': మందస మండలంలో కోటి రూపాయలతో సాగునీటి కాలువల పూడికతీత పనులు ప్రారంభం.

‘ప్రతి చేనుకు నీరు – ప్రతి చేతికి పని’: మందస మండలంలో కోటి రూపాయలతో సాగునీటి కాలువల పూడికతీత పనులు ప్రారంభం!

MANDASA : స్వాతంత్య్ర సమరయోధులు, ఆదర్శ ప్రజా నాయకులు సర్దార్ గౌతు లచ్చన్న గారి ఉద్యమ స్ఫూర్తితో.. తండ్రి గౌతు శ్యామసుందర శివాజీ గారి ఆశయ సాధనతో.. ప్రజాసేవే పరమావధిగా నిరంతరం ప్రజలతో మమేకమవుతూ పలాస నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు స్థానిక శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష గారు. నిరంతరం ప్రజల పక్షపాతిగా నిలుస్తూ, వారి కష్టసుఖాల్లో భాగస్వామి అవుతున్న ఆమె, పలాస నియోజకవర్గ రైతాంగ సంక్షేమం కోసం మరో కీలక అడుగు వేశారు.

‘రైతు ఆనందమే లోకానందం’ అనే ఉన్నతమైన సంకల్పంతో, ‘ప్రతి చేనుకు నీరు – ప్రతి చేతికి పని’ అనే నినాదాన్ని సాకారం చేసేందుకు మందస మండలంలో సుమారు 32 సాగునీటి కాలువల పూడికతీత పనుల కోసం ఒక కోటి రూపాయల భారీ నిధులను మంజూరు చేశారు.

దీనిలో భాగంగా, సిరిపురం మెయిన్ టన్నెల్ వద్ద కాలువ పూడికతీత పనులను అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లస్టర్ కో-ఇంచార్జ్ బేసి ఈశ్వర్ రావు గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిరిపురం గ్రామ పంచాయతీ ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజల క్షేమం కోసం, గ్రామాల అభివృద్ధి కోసం శ్రమిస్తున్న శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష గారికి, సిరిపురం పంచాయతీ అభివృద్ధికి ప్రత్యేకంగా సహకరిస్తున్నందుకు గ్రామ ప్రజలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కాలువల పూడికతీత పనుల ద్వారా రాబోయే రోజుల్లో సాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular