Homeఆంధ్రప్రదేశ్శ్రీకాకుళంరెవెన్యూ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి.

రెవెన్యూ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి.

SRIKAKULAM : శ్రీకాకుళం జిల్లాలో రెవెన్యూ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసుల సంఘం.

శ్రీకాకుళం జిల్లాలో రెవెన్యూ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసుల సంఘం

SRIKAKULAM : శ్రీకాకుళం జిల్లాలోని అన్ని రెవెన్యూ కార్యాలయాలలో ఉద్యోగులందరినీ భాగస్వామ్యం చేస్తూ, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు పాల్గొనే విధంగా జూన్ 20న నిర్వహించనున్న రెవెన్యూ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసుల సంఘం ప్రతినిధులు గౌరవ జిల్లా కలెక్టర్ ని కోరారు.

ఈ సందర్భంగా తహసీల్దార్లకు పదోన్నతులు కల్పించడంలో సహకరించినందుకు సంఘం తరఫున జిల్లా కలెక్టర్ ని సత్కరించారు. అనంతరం రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ముఖ్యంగా ఉద్యోగులపై పెరుగుతున్న పని భారాన్ని తగ్గించడం, అన్ని పనులను ఏకకాలంలో నిర్వహించాల్సిన పరిస్థితికి బదులుగా ప్రభుత్వ ప్రాధాన్యతా క్రమంలో విధులను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవడం, రోజువారీ పరిపాలనా కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన బడ్జెట్‌ను కేటాయించడం, కోర్టు కేసుల నిర్వహణకు ప్రత్యేక నిధులు మంజూరు చేయడం వంటి అంశాలను ప్రతిపాదించారు.

అదేవిధంగా రీ-సర్వే కార్యక్రమం అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు, పీజీఆర్ఎస్ (PGRS) ఫిర్యాదుల పరిష్కారంలో ఎదురయ్యే సమస్యలు, రీ-సర్వే ఉప తహసీల్దార్ పోస్టుల కొనసాగింపునకు ఉత్తర్వులు జారీ చేయడం, జూనియర్ సహాయకులు మరియు గ్రామ రెవెన్యూ అధికారులకు సర్వే శిక్షణ కల్పించేందుకు ప్రతిపాదనలు పంపడం, ప్రతి నెల ఒకరోజు ఉద్యోగుల గ్రీవెన్స్ సమావేశం నిర్వహించడం, ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడం తదితర అంశాలపై చర్చ జరిగింది.

ఈ అంశాలన్నింటిపై జిల్లా కలెక్టర్  సానుకూలంగా స్పందించినట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు  బి.వి.వి.యెన్. రాజు, సహాధ్యక్షుడు ఎస్. గణపతిరావు, జిల్లా కార్యదర్శి  డి. సోనికిరణ్, ఉపాధ్యక్షులు  బి. గోపాలరావు,  కె. అరుణ్ కుమార్,  డి. పద్మావతి, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ  ఐ. లింగరాజు, జాయింట్ సెక్రటరీలు  ఎం. గౌరీశంకర్,  కె. రాధిక, ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి.హెచ్. దామోదరరావు, కలెక్టరేట్ సెక్రటరీ  పి. పద్మావతి, శ్రీకాకుళం డివిజన్ అధ్యక్షుడు ఎస్. కిరణ్ కుమార్, డివిజన్ కార్యదర్శిడి. ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular