శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ సమావేశంలో పాల్గొన్నారు.

SRIKAKULAM : రానున్న ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వంశధార జలాలను చివరి ఆయకట్టు వరకు అందించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఇప్పటికే పూర్తి చేసిన ఇరిగేషన్ పనులకు సంబంధించిన బిల్లులను త్వరితగతిన చెల్లించి రైతులకు, కాంట్రాక్టర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను కోరారు.

ముఖ్యంగా వంశధార నీరు అందని మందస మండల ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు. కళింగదల, డబారుసింగి, దామోదర్ సాగర్ ప్రాజెక్టులతో పాటు బెల్లుపటియా అక్విడక్ట్ మరమ్మతులు మరియు అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలని సంబంధిత అధికారులను కోరారు. రైతుల సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పనులను ప్రాధాన్యతగా పూర్తి చేసి, మండలంలోని రైతులకు నీటి సమస్యలు లేకుండా శాశ్వత పరిష్కారం కల్పించేందుకు కృషి చేస్తున్నాము అని తెలిపారు.
ప్రతి రైతుకు సమృద్ధిగా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, రైతుల సంక్షేమం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు.
