Homeఆంధ్రప్రదేశ్కార్గో ఎయిర్‌పోర్ట్‌పై రైతులతో కలెక్టర్ చర్చ.

కార్గో ఎయిర్‌పోర్ట్‌పై రైతులతో కలెక్టర్ చర్చ.

M. GADURU : జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు వివరించారు.

నెలకో నియోజకవర్గం-నాలుగు మండలాలు అనే కార్యక్రమంతోపాటు – కార్గో ఎయిర్‌పోర్ట్‌పై రైతులతో కలెక్టర్ చర్చ.

శ్రీకాకుళం జిల్లా మందస మండలం ఎం.గడూరు గ్రామంలో నెలకో నియోజకవర్గం-నాలుగు మండలాలు అనే కార్యక్రమంతోపాటు – కార్గో ఎయిర్‌పోర్ట్‌పై రైతులతో చర్చా కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హాజరయ్యారు. కలెక్టర్ రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన కలెక్టర్, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ప్రతిపాదిత కార్గో ఎయిర్‌పోర్ట్ అంశంపై గ్రామ రైతులు కలెక్టర్‌ను కలిసి తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వంశపారంపర్యంగా సాగుచేస్తున్న భూములపైనే తమ కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, సంవత్సరానికి ఆరు రకాల పంటలు పండిస్తున్నామని తెలిపారు. భూములు కోల్పోతే తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములను ఇవ్వబోమని రైతులంతా ముక్త కంఠంతో తెలియజేసారు. కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకునేవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు రీసర్వే కు అంగీకరించే ప్రసక్తే ఉండదని కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర.వాసు తోపాటు పలువురు రైతులు తమ బాణీని జిల్లా కలెక్టర్ కు వినిపించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు వివరించారు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కంపెనీలు, యూనివర్సిటీలు వంటి సంస్థలు రావడం అవసరమన్న ఆయన, ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే పలు ఇండస్ట్రీస్ వస్తాయని, రేపటి తమ పిల్లలకు ఉద్యోగావకాశాలతో భవిష్యత్తు బాగుంటుందని, నిదానంగా తమ పిల్లలతో కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు కలెక్టర్ హితవు పలికారు.

ఈకార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తోపాటు కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర.వాసు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular