నన్ను నా కుటుంబాన్ని ఆదుకోండి మహాప్రభో..అంటూ రైలు ఆక్సిడెంట్ లో తన రెండు చేతులు కోల్పోయిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం బి.సావరం గ్రామానికి చెందిన అచంట కృష్ణమూర్తి మొరపెట్టుకున్నాడు.
100 శాతం అంగవైకల్యం సర్టిఫికెట్ ఉన్నప్పటికీ ఎన్నిసార్లు పింఛన్ కి దరఖాస్తు చేసుకున్న అధికారులు స్పందించడం లేదని కన్నీటి పర్యంతం అవుతున్నాడు. 1999 లో జరిగిన ఒక రైలు ప్రమాదంలో తన రెండు చేతులు పోయాయని, వేరొకరి సాయం లేకుంటే తను జీవించటం కష్టం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
తనకు 2012 వరకు వికలాంగుల పింఛను వచ్చేదని, అయితే తనకు సంబంధం లేని ఒక క్రిమినల్ కేసులో ఇరుక్కోవడంతో తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని, దాంతో తన పింఛను, రేషన్ కార్డు కోల్పోయినట్లు తెలిపాడు.
2014 లో తాను అత్యున్నత న్యాయస్థానానికి అప్పీలు చేసుకోగా.. తనను అన్యాయంగా ఆ కేసులో ఇరికించారని, తనపై పడ్డ శిక్ష రద్దు చేస్తు ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందన్నాడు.
2014 నుండి తనకు తిరిగి పింఛను ఇప్పించవలసిందిగా, ఎన్నిసార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించే నాధుడే లేరని వాపోతున్నాడు.
తనకు వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారని.. కొడుకుగా వారి ఆలనా పాలనా చూడాల్సిన నేను వారికి భారంగా మారానని అసహనం వ్యక్తం చేస్తున్నాడు.
ఇటీవలే తనకు తోడుగా ఉంటుందని తల్లిదండ్రులు ఒక అమ్మాయితో వివాహం చేసారని, ఆమెను తల్లిదండ్రులను ఎలా పోషించాలో అర్థం కావడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి నాకు పింఛన్ ఇప్పించి, తన కుటుంబాన్ని ఆడుకోవాలంటూ మొరపెట్టుకుంటున్నాడు.
