2010-11 బ్యాచ్ పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.
సందడిగా గడిపిన పూర్వ విద్యార్థులు.
స్నేహితులను చూసి మురిసిపోయిన పూర్వ విద్యార్థులు.
ఆటపాటలు, సెల్ఫీలతో రోజంతా సందడి.
కవిటి మండలం ఆర్ బెలగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2010 – 11 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం అత్యంత ఉత్సాహంగా జరిగింది. సుమారు పదిహేనేళ్ల అనంతరం సహచర విద్యార్థులందరూ ఒకే చోట చేరడంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ఇందులో భాగంగా చిన్ననాటి స్నేహితులు ఒకరినొకరు కౌగలించుకుని, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల్లో కూర్చుని నాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. ఆటపాటలు, సెల్ఫీలతో రోజంతా సందడిగా గడిపారు.

తమ ఎదుగుదలకు పునాది వేసిన పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పాఠశాల సిబ్బందికి చెప్పారు. దాదాపు పదిహేనేళ్ల అనంతరం తమ స్నేహితులను చూసి పూర్వ విద్యార్థులు మురిసిపోయారు. చదువుకున్న పాఠశాల, పుట్టిన గ్రామాన్ని ఎప్పటికీ మరువరాదని పూర్వ విద్యార్థులు అన్నారు. నాడు చదువుకున్న పాఠశాలలో కలవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ… తాము చదువుకున్న పాఠశాలకు తనవంతు సాయం అందిస్తామని చెప్పారు.
