Homeఆంధ్రప్రదేశ్చింతామణి సంబరాలకు రామ్మోహన్ నాయుడుకు ఆహ్వానం.

చింతామణి సంబరాలకు రామ్మోహన్ నాయుడుకు ఆహ్వానం.

KAVITI : ఉద్దాన ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం, కవిటి శ్రీ చింతామణి అమ్మవారి సంబర మహోత్సవాల్లో పాల్గొనాలని నిర్వాహక కమిటీ సభ్యులు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ఆహ్వాన పత్రిక అందించారు.

కవిటి: చింతామణి సంబరాలకు రండి..!!
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఆహ్వానం పలికిన ఉత్సవ కమిటీ సభ్యులు.

ఉద్దాన ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం, కవిటి శ్రీ చింతామణి అమ్మవారి సంబర మహోత్సవాల్లో పాల్గొనాలని నిర్వాహక కమిటీ సభ్యులు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ఆహ్వాన పత్రిక అందించారు. శుక్రవారం నాడు శ్రీకాకుళం నగరంలోని కేంద్ర మంత్రి స్వగృహంలో ఆయన్ను కలసి స్వయంగా ఆహ్వానాన్ని అందించారు. ఈనెల 13వ తారీఖున ప్రారంభమైన సంబరాలు.. జూన్ రెండవ తేదీ వరకు మొత్తంగా 21 రోజులు జరుగుతాయని కమిటీ సభ్యులు తెలిపారు. తొమ్మిదేళ్లకు ఒకసారి ఉత్సవాలు నిర్వహిస్తారని.. ఆలయ వైభవాన్ని వివరిస్తూ.. ఈ అరుదైన ఉత్సవాల్లో పాల్గొనాలని కమిటీ సభ్యులు కోరారు. ఆహ్వానం అందించినందుకు ధన్యవాదాలు తెలిపిన రామ్మోహన్ నాయుడు.. చింతామణి తల్లి ఆశీస్సులు తీసుకుంటానని తెలిపారు. తొమ్మిదేళ్ళ తరువాత జరిగే ఉత్సవాలు ఘనంగా జరపాలని, ఏదన్నా అవసరం, ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కేంద్ర మంత్రికి ఆహ్వానం అందించిన వారిలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు బెందాళం రమేష్, ఏ.ఏం.సి మాజీ ఉపాధ్యక్షులు సీపాన వెంకట రమణ, తమరాల జయరాం, బెందాళం చక్రధర్, ప్రగడ మణిబాబు, పుల్లట రాజు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular