Homeఆంధ్రప్రదేశ్గుర్తుతెలియని మృతదేహం లభ్యం

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

PALASA : గుర్తుతెలియని మృతదేహం లభ్యం.

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

PALASA : శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీ పెంటిబద్ర గ్రామ సమీపంలో గుర్తు తెలియని సుమారు 40 నుండి 45 సంవత్సరాల వయసు గల పురుషుని మృతదేహం తీవ్ర కలకలం రేపింది.

గ్రామ పొలాల్లో దుర్వాసన వెదజల్లుతూ ఉండడంతో స్థానికులు గమనించి చూడగా మృతదేహం పూర్తిగా కుళ్ళి దుర్వాసన వెదజల్లుతుండడంతో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు.

సమాచారమందుకున్న కాశీబుగ్గ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని,ఘటనాస్థలాన్ని పరిశీలించారు.అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మృతుడు ఎండ వేడిమికి డీహైడ్రేషన్ తో 3 రోజుల క్రితమే చనిపోయిఉండొచ్చని ప్రాధమికంగా వైద్యులు దృవీకరించినట్లు పోలీసులు చెపుతుండగా,మృతుని మరిన్ని వివరాల కోసం ఆరా తీస్తున్నామని,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కాశీబుగ్గ సి.ఐ వై.రామకృష్ణ మీడియాకు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular