కవిటి చింతామణి తల్లిని దర్శించుకున్న ఇచ్ఛాపురం సీఐ
KAVITI : కవిటి పట్టణంలో కొలువైన చింతామణి అమ్మవారి ఆలయానికి ఇచ్ఛాపురం సీఐ ఎం. చిన్నంనాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సీఐ చిన్నంనాయుడు, కుటుంబ సభ్యులను శాలువా, స్మృతిచిహ్నంతో సన్మానించారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని సీఐ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు.
