KAVITI : కవిటి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బి. గొనపపుట్టుగ పాఠశాల ఆవరణలో పేద విద్యార్థికి సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగినది. ఈరోజు గ్రామ పెద్దల సమక్షంలో ఆరవ తరగతి చదువుతున్న మన్మోహన్ కు సైకిల్ పెద్దల సమక్షంలో బాబు రావు గారు అందజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎంఈఓ 1 ధనుంజయ మజ్జి గ్రామ మాజీ సర్పంచ్ బద్రి ప్రకాష్ మరియు ఎంపీటీసీ సభ్యులు ప్రియా కృష్ణారావు మాజీ పాఠశాల కమిటీ చైర్మన్ శమళ్ళ. సర్వేశ్వరరావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ విద్యా సంవత్సరంలో అనేకమంది పిల్లలను చేర్పించడం ప్రధాన భూమిక పోషించిన బొడ్డ. వేణుగోపాలరావు గారికి పాఠశాల సిబ్బంది మరియు గ్రామ పెద్దలు కొనియాడడం జరిగింది. మరియు ఏడవ తరగతి చదువుతున్న ఎర్ర వేణు కి సైకిల్ బహుమతిగా ప్రకటించేటట్టుగా బద్ది ప్రకాష్ వివరించారు ఆరో తరగతి చదువుతున్న బెవరా లిఖిత కి మరొక సైకిల్ బహుమతిగా ఇచ్చేందుకు ఉపాధ్యాయులు బాబురావు ప్రకటించారు.
