సోంపేట రైల్వేస్టేషన్లో ‘నషా ముక్త్ భారత్’ అవగాహన సదస్సు.
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ఎస్ఐ పారినాయుడు పిలుపు.
Sompeta: మనదేశంలో యువతలో మాదకద్రవ్యాల దుర్వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయమని కంచిలి ఎస్ఐ పారినాయుడు అన్నారు. ‘నషా ముక్త్ భారత్’ అభియాన్‌లో భాగంగా కంచిలి మండల కేంద్రంలోని సోంపేట రైల్వేస్టేషన్ ఆవరణలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయని హెచ్చరించారు. డ్రగ్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, నేర ప్రవృత్తి, సామాజిక రుగ్మతలపై ప్రయాణికులకు, స్థానిక యువతకు అవగాహన కల్పించారు.
అనంతరం మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ విక్రయాలు, వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
