కొర్లాంలో ఉపాధి కూలీలకు సైబర్ నేరాలపై అవగాహన.
నారీ శక్తి యాప్ వినియోగంపై ఎస్ఐ హరిబాబు దిశానిర్దేశం.
SOMPETA: సోంపేట మండలం కొర్లాం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు సైబర్ నేరాలు, నారీ శక్తి యాప్ వినియోగంపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎస్ఐ హరిబాబు ఆధ్వర్యంలో జరిగిన, ఈ కార్యక్రమంలో మహిళా కూలీలకు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని, అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని, ఫేక్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలని ఎస్ఐ వివరించారు.
మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘నారీ శక్తి’ యాప్‌ను ప్రతి ఒక్కరూ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని, ఆపద సమయంలో ఎస్ఓఎస్ బటన్ నొక్కడం ద్వారా వెంటనే పోలీసుల సహాయం పొందవచ్చని తెలిపారు. యాప్ ఇన్స్టాలేషన్, వినియోగ విధానాన్ని కూలీలకు ప్రత్యక్షంగా చూపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళా ఉపాధి కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
