Homeఎడ్యుకేషన్బడి పిలుస్తుంది ప్రచార రథానికి శ్రీకారం

బడి పిలుస్తుంది ప్రచార రథానికి శ్రీకారం

బూరగాంలో అవగాహన ర్యాలీ

బూరగాంలో అవగాహన ర్యాలీ

జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు కంచిలి మండలంలో  “బడి పిలుస్తుంది” కార్యక్రమాన్ని ఉత్సాహంగా ప్రారంభించారు.  ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు సప్పటి శివరామ ప్రసాద్,  కుంబి చిట్టిబాబు బూరగాం గ్రామం నుంచి ప్రచార రథాన్ని ప్రారంభించారు.

పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తూ ఊరంతా ర్యాలీ నిర్వహించారు.   విద్య యొక్క ప్రాముఖ్యత,  ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాల గురించి అధికారులు వివరించారు.

ఈ ర్యాలీలో గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ మడ్డు వెంకటేశ్వరరావు,  కప్ప మీనారావు,  బద్రి నాగేశ్వరరావు,  మాస్టిల మన్మధరావు అలాగే ఉపాధ్యాయ బృందం బల్ల కాంతారావు,  కుసరాజు, మడ్డు తిరుపతిరావు , అనిల్,  లక్ష్మి మేడం  గ్రామస్తులు పెద్దలు సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular