Homeఎడ్యుకేషన్ఏపీ మోడెల్ స్కూల్లో ఉత్సాహం.

ఏపీ మోడెల్ స్కూల్లో ఉత్సాహం.

ర్యాంకులతో రాణించిన విద్యార్థులకు ఘన సత్కారం..

ర్యాంకులతో రాణించిన విద్యార్థులకు ఘన సత్కారం..

కంచిలి మండల పరిధిలోని మఠం సరియాపల్లి ఏపీ మోడల్ పాఠశాల మరియు కళాశాలలో విద్యార్థులు సాధించిన అద్భుత ఫలితాలకు గుర్తింపుగా విజయనగరం కృష్ణారెడ్డి అకాడమీ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.  పదవ తరగతి,  ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ర్యాంకులతో మెరిసిన విద్యార్థులను  మెమెంటోలు, రూ.1000 నగదు ప్రోత్సాహకం, శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ కృష్ణంరాజు,  కృష్ణారెడ్డి,  మండల విద్యాశాఖ అధికారి-2 చిట్టిబాబు హాజరై విద్యార్థుల ప్రతిభను అభినందించారు.  ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణంరాజు మాట్లాడుతూ,   “స్పష్టమైన లక్ష్యం,  క్రమశిక్షణ, నిరంతర కృషి ఉంటే విజయం తప్పదని” విద్యార్థులకు సూచించారు.

పదవ తరగతి లో కర్రీ స్వాతి (587), పొందర రీతిగా బడిత్య (585), శ్రద్ధాంజలి మహంతి (583), తెలుకల జాహ్నవి (577), పుతిర్ల రవి కిరణ్ (574) టాప్ స్థానాల్లో నిలిచి ప్రత్యేక సన్మానం అందుకున్నారు.
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో కర్తరి మౌనిక (971), బీపీసీ విభాగంలో కర్రీ సంతోషి (987), దత్తి లోలమ్మ (981), సీఈసీ విభాగంలో తమరాల మనీషా (833) ప్రతిభ కనబరిచి ప్రశంసలు అందుకున్నారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నడకుదుటి శివప్రసాద్, మండల విద్యాశాఖ అధికారి-2 చిట్టిబాబు,  వైస్ ప్రిన్సిపాల్ కవితా సాహా,  ఉపాధ్యాయులు  రవి, దివాకర్, రమేష్, శారద తదితరులు పాల్గొన్నారు. సన్మాన కార్యక్రమం పాఠశాలలో ఉత్సాహభరిత వాతావరణాన్ని నెలకొల్పింది.

RELATED ARTICLES

Most Popular