Homeఆంధ్రప్రదేశ్భారీ వర్షాల నేపథ్యంలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గౌతు శిరీష ఆకస్మిక పర్యటన

భారీ వర్షాల నేపథ్యంలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గౌతు శిరీష ఆకస్మిక పర్యటన

Palasa: భారీ వర్షాల నేపథ్యంలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గౌతు శిరీష ఆకస్మిక పర్యటన

భారీ వర్షాల నేపథ్యంలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గౌతు శిరీష ఆకస్మిక పర్యటన

దేశబట్టి చెరువు–కాలువ వద్ద నిలిచిపోయిన నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

రైల్వే అధికారులను పిలిపించి తక్షణమే పనులు చేపట్టాలని ఆదేశాలు

డ్రైనేజీ సమస్యలపై మున్సిపల్ అధికారులకు పలు సూచనలు

పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు, ప్రాణ మరియు ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష అధికారులను ఆదేశించారు.

భారీ వర్షాల నేపథ్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో పరిస్థితిని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే గౌతు శిరీష, దేశబట్టి చెరువు సమీపంలోని కాలువ ప్రాంతాన్ని సందర్శించారు. రైల్వే పనుల కారణంగా దేశబట్టి కాలువ వద్ద గ్రావెల్ వేయడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి, వర్షపు నీరు సక్రమంగా వెళ్లకపోతే పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరే ప్రమాదం ఉందని స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

అక్కడ జరుగుతున్న రైల్వే పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, సంబంధిత రైల్వే అధికారులను అక్కడికి పిలిపించి, కాలువలో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని పనులను ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించి, నీటి ప్రవాహం సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజల ఇళ్లకు నీరు చేరే పరిస్థితి ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 3 రోడ్ల జంక్షన్ వద్ద డ్రైనేజీ పరిస్థితిని ఎమ్మెల్యే పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా డ్రైన్ స్టాక్ కావడంతో నీరు నిలిచిపోయిన పరిస్థితిని గమనించి, వెంటనే డ్రైనేజీని శుభ్రం చేసి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.

పట్టణంలోని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది మరియు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేశారు. భారీ వర్షాల సమయంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా, వర్షాల ప్రభావం తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గౌతు శిరీష సూచించారు.

RELATED ARTICLES

Most Popular