Homeఆంధ్రప్రదేశ్యోగాతో ఆరోగ్యం.. క్రమశిక్షణతో జీవనోన్నతి.

యోగాతో ఆరోగ్యం.. క్రమశిక్షణతో జీవనోన్నతి.

KAVITI:యోగాతో ఆరోగ్యం.. క్రమశిక్షణతో జీవనోన్నతి.

యోగాతో ఆరోగ్యం.. క్రమశిక్షణతో జీవనోన్నతి.

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ బాబు.

కవిటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం కవిటి అగ్నికుల క్షత్రియ సంఘ భవనంలో ఘనంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ బాబు హాజరై యోగా ప్రాముఖ్యతపై మాట్లాడారు.

యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యానికి బలమైన సాధనమని ఆయన పేర్కొన్నారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. యువత, విద్యార్థులు యోగా అలవాటు చేసుకుని ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొని యోగా ఆసనాలు చేశారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు పొందల కృష్ణారావు, బెందాళం రమేష్ అదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular