- పలాస లో ముమ్మర వాహన తనికీలు
ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు తప్పనిసరిగా ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించాలంటూ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ సబ్ డివిజనల్ అధికారి టి.భవాని వాహనదారులకు హితవు పలికారు.
పలాస మండలం కోసంగిపురం సమీప జాతీయరహదారి వద్ద కాశీబుగ్గ డిఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మర వాహన తనికీలు నిర్వహించారు.
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా పలువురు వాహనాదారులకు హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే నష్టాలను డిఎస్పీ వివారించారు.
పలు వాహనాలు చోరీకి గురవుతున్న కారణంగా చోరీలకు పాల్పడుతున్న వారిపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో వాహనాలను ఆపి తనికీలు నిర్వహించారు,సరైన పత్రాలు లేని వాహనాలను పోలీసులు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈసందర్భంగా వాహన ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు హెల్మెట్ వాడకం తోపాటు, అతివేగం అత్యంత ప్రమాదకరమంటూ వాహనదారులకు కాశీబుగ్గ డిఎస్పీ టి.భవాని అవగాహన కలిగించారు.
ఈ తనికీల్లో కాశీబుగ్గ యెస్.ఐ ఆర్.నరసింహమూర్తి,ఏఎస్సై ఆనందరావు తోపాటు పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
